బండి మీద కుక్క చావు…! మనుషుల ప్రాణాలు పరోక్షంగా తీస్తున్న కుక్కలు…!

-

గ్రామ సింహాలు” గ్రామాల్లో సీసి కెమెరాలు, భద్రతా సిబ్బంది ఇవే… ఇవి ఉన్నాయి అంటే దొంగలు కూడా దడిచే పరిస్థితి ఉంటుందనే సంగతి అందరికి తెలిసిందే. మరి ఇప్పుడు ఈ గ్రామ సింహాలే ఇప్పుడు ప్రాణాలు తీస్తున్నాయి. గ్రామాల్లో రక్షణగా ఉండే ఈ గ్రామ సింహాలు ద్విచక్ర వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఒకసారి ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సిద్దారం గ్రామంలో ఒక కుటుంబం సినిమాకి వెళ్లి వస్తుంది. రహదారిపై కుక్కలు పడకుని ఉండటంతో తప్పించబోయి పక్కకు తిప్పగా వెళ్లి కరెంట్ స్తంభాన్ని డీకొట్టడంతో…

ఒక పోలీసు అధికారి తీవ్రంగా గాయపడి మూడు నెలలు హాస్పిటల్ లో ఉండి ప్రాణాలు కోల్పోయాడు. మరో సంఘటనలో కృష్ణా జిల్లా వెంకటాపురం గ్రామ౦లో ఇలాంటి సంఘటనే జరిగింది. ద్విచక్ర వాహన దారులు కొందరు పౌల్ట్రీ ఫాం నుంచి వస్తు కుక్కలు పరిగెత్తుకుని రావడంతో కంగారులో చెట్టుని డీకొట్టడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరో సంఘటనలో సైకిల్ పై గడ్డి మోపులు తీసుకువస్తు కృష్ణా జిల్లా పునాదిపాడులో ఇద్దరు వృద్దులు కుక్కలు పరిగెత్తుకుని రావడంతో కంగారు పడి పక్కకు జరగగా లారి డీకొట్టి ప్రాణాలు కోల్పోయారు.

ఇలా దాదాపు అన్ని గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. వాటి సంఖ్య క్రమంగా పెరుగుతూ రావడం, సంతాన ఉత్పత్తి శాతం కూడా ఎక్కువగా ఉండటంతో గ్రామాల్లో వాటి సంఖ్య విచ్చలవిడిగా పెరుగుతుంది. పలువురు తీవ్రంగా గాయపడి బాధలు పడుతుంటే కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. వాహనాల వెంట పడటంతో కంగారు పడి ఎదుటి వాహనాలను డీ కొట్టి ప్రాణాలు కోల్పోతున్నారు. దీనిపై ప్రభుత్వాలు, గ్రామ పంచాయితీలు చర్యలు తీసుకోవాలని గ్రామాల్లో ఉండే వారు కోరుతున్నారు. ఇదే కొనసాగితే మరిన్ని ప్రమాదాలు చోటు చేసుకుంటాయని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version