అమెరికా ప్రధాన వైద్య సలహాదారు డాక్టర్ ఫాసీ కీలక వ్యాఖ్యలు చేసారు. భారత్ కు అండగా నిలిచే విషయంలో సంపన్న దేశాలు విఫలం అయ్యాయని అందుకే ఇప్పుడు భారత్ లో పరిస్థితి దారుణంగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. డాక్టర్ ఫౌసీ ది గార్డియన్‌తో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసారు. భారత్ విషయంలో దేశాలు అన్నీ ఏకం కావడంలో విఫలం అయ్యాయని ఆయన అన్నారు.
భారతదేశం ఎదుర్కొంటున్న విషాదం నుంచి బయటకు తీసుకురావడానికి ప్రపంచం మొత్తం ఐక్యంగా ఉండాలని అన్నారు. అన్ని దేశాలకు సమానమైన అవకాశాలను వైద్య రంగంలో కల్పించడంలో సంపన్న దేశాలు విఫలం అయ్యాయని అన్నారు. ఈ పరిస్థితికి ధనిక దేశాలు అన్నీ బాధ్యత వహించాలని అన్నారు. దేశంలో భయంకరమైన విషాదకరమైన పరిస్థితి ఉందని అన్నారు. ఎందుకంటే తగినంత ఆక్సిజన్ లేదు , తగినంత ఆసుపత్రి పడకలు లేవు… దీని నుంచి బయటకు రావడానికి మనం ప్రయత్నించాలి అన్నారు.