ఐపిఎల్ క్రికెట్ బెట్టింగ్ వ్యవహారం లో ఏసీబీ తీగ లాగుతుంటే ఇప్పుడు డొంక అంతా కదులుతోంది. పోలీస్ శాఖలో క్రికెట్ బెట్టింగ్ కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. సిఐ జగదీష్ బెట్టింగ్ కేసులో కామారెడ్డి డిఎస్పీ పాత్రపై ఏసీబీ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. డీఎస్పీ కార్యాలయంలో రికార్డులు తనిఖీ చేసిన ఏసీబీ అధికారులు డీఎస్పీ సెలవులో ఉండటంతో ఆయన ఇంటిని సీజ్ చేశారు. హుటాహుటిన హైదరాబాద్ నుంచి కామారెడ్డికి డిఎస్పీ వస్తున్నట్లు సమాచారం అందుతోంది.
ఇప్పటికీ ఐపీఎల్ బెట్టింగ్ కేసులో సీఐ జగదీష్ , మధ్యవర్తిగా వ్యవహరించిన సుజయ్ ను ఏసిబి అధికారులు అరెస్ట్ చేశారు. రిమాండ్ కు తరలించేందుకు ముందు మెడికల్, కోవిడ్ పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఎసిబి అధికారులు. సిఐ ఇంటితో పాటు సిఐ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు జరిపి ఈ సోదాల సమయంలో కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు అధికారులు.