Eagle: రవితేజ కోసం వెనక్కి తగ్గిన సందీప్ కిషన్…

-

మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ఈగల్. అయితే ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకి రావాల్సి ఉంది. కానీ సంక్రాంతికి బడా సినిమాలు రిలీజ్ కావడంతో బాక్సాఫీస్ వద్ద తీవ్రమైన పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో నిర్మాత దిల్ రాజు ఈగల్ సినిమా నిర్మాతని తన చిత్రం వాయిదా వేసుకుంటే సోలో రిలీజ్ డేట్ ఇస్తామని ఆఫర్ చేశాడు. దీంతో ఈగల్ చిత్రం వాయిదా పడింది.

అయితే ఈగల్ చిత్ర నిర్మాతలు ఈ సినిమాని ఫిబ్రవరి 9కి రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. కానీ ఇదే రోజు సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న ఊరు పేరు భైరవకోన చిత్రం కూడా రిలీజ్ కు సిద్ధం అవుతుంది. అంతేకాకుండా యాత్ర 2, లాల్ సలాం చిత్రాలు కూడా రిలీజ్ కు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఈగల్ నిర్మాతకు ముందు ఇచ్చిన మాట ప్రకారం నిర్మాత దిల్ రాజు ఈ మూడు చిత్రాల నిర్మాతలను సంప్రదించగా కేవలం ఊరు పేరు భైరవకోన నిర్మాత మాత్రమే సానుకూలంగా స్పందించాడు . మిగతా రెండు చిత్రాల నిర్మాతలు తాము రిలీజ్ డేట్ ని మార్చుకోలేమని స్పష్టం చేసినట్లు సమాచారం. నిర్మాత దిల్ రాజ్ మాట్లాడుతూ ఈ సినిమాకి ఎక్కువగా థియేటర్లు లభించేలా చర్యలు తీసుకుంటామని ఈగల్ చిత్ర నిర్మాతలకు హామీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version