మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలీ జిల్లాలో ఇవాళ మరోసారి భూప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేల్‌పై 3.2తీవ్రతతో భూకంపం నమోదైంది. మధ్యాహ్నం 2.35 గంటల ప్రాంతంలో ప్రకంపనలు వచ్చాయని నేషనల్ సెంటర్ తెలిపింది. భూమికి 10 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు గురించినట్లు పేర్కొంది. ప్రకంపనలతో ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా.. ఇవాళ ఉదయం పంజాబ్‌లోనూ భూకంపం సంభవించింది. అయితే, భూకంప కేంద్రం పాక్‌లో గుర్తించినట్లు ఎన్‌సీఎస్ తెలిపింది. అమృత్‌సర్‌లో 4.1 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్‌సిఎస్) తెలిపింది. తెల్లవారుజామున 3:42 గంటలకు ప్రకంపనలు సంభవించాయని తెలిపింది. ఈ నెల 12న రాత్రి 8 గంటల ప్రాంతంలో దిల్లీ ఎన్‌సీఆర్ పరిధిలో రిక్టర్ స్కేల్‌పై 5పైగా తీవ్రతతో ప్రకంపనలు నమోదయ్యాయి.