ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో ప్రస్తుతం కొత్త కోవిడ్ స్ట్రెయిన్‌కు చెందిన కేసులు నమోదవుతున్నాయి. మొదట యూకేలో ఆ స్ట్రెయిన్ బయట పడగా ఇప్పుడది ఇతర దేశాలకు వ్యాప్తి చెందింది. దీంతో కొత్త స్ట్రెయిన్ పట్ల ఆయా దేశాలు అనేక జాగ్రత్తలను తీసుకుంటున్నాయి. అయితే కొత్త కోవిడ్ స్ట్రెయిన్‌కు వ్యతిరేకంగా పోరాడేందుకు ఇమ్యూనిటీ లభించాలంటే అందుకు పాప్ కార్న్ తినాలని ఓ పాకిస్థాన్ వైద్యుడు సూచించాడు.
పాకిస్థాన్‌కు చెందిన జీఎన్ఎన్ టీవీ అనే చానల్ ఇటీవల డాక్టర్ షాహిద్ మసూద్ అనే వైద్యుడితో లైవ్ షో చేసింది. అయితే అందులో షాహిద్ షాకింగ్ వ్యాఖ్యలు చేశాడు. పాప్ కార్న్‌ను తినడం వల్ల ఇమ్యూనిటీ లభిస్తుందని, దాంతో కొత్త కోవిడ్ స్ట్రెయిన్‌ను ఎదుర్కోవచ్చని అన్నాడు. కాగా అతను అలా మాటలకు చెందిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Covidiot wisdom: Eat popcorn and increase immunity against the new coronavirus.🍿 pic.twitter.com/i4vqcpuj2N
— Naila Inayat नायला इनायत (@nailainayat) December 29, 2020
ఆ పాకిస్థాన్ డాక్టర్ అలా అనగానే లైవ్‌లో ఉన్న యాంకర్ సైతం నవ్వడం విశేషం. అయితే ఈ విషయంపై అటు పాకిస్థాన్‌తోపాటు ఇటు భారత్‌కు చెందిన నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఆ డాక్టర్ గారి తెలివి అలా ఉందంటూ ట్రోల్ చేస్తున్నారు. కాగా పాకిస్థాన్‌లో ఇప్పటి వరకు మొత్తం 4,75,085 కరోనా కేసులు నమోదు కాగా, 4,25,494 మంది కోలుకున్నారు. 9,992 మంది చనిపోయారు.