ఈనెల 21న విచారణకు రావాలంటూ సోనియా గాంధీకి ఈడి సమన్లు

-

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నడిచిన నేషనల్ హెరాల్డ్ పత్రిక కు సంబంధించిన ఆస్తుల కేసులో మనీలాండరింగ్ జరిగిందన్న ఆరోపణలపై ఇదివరకే సోనియాగాంధీతో పాటు ఆమె కుమారుడు రాహుల్ గాంధీకి కూడా ఈడి సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈడీ సమన్లు జారీ అయ్యాక సోనియా కరోనా బారిన పడగా.. రాహుల్ గాంధీ ఇప్పటికే ఈడీ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే.

అయితే హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయిన తర్వాత అనారోగ్య కారణాల వల్ల తాను ఇప్పటికిప్పుడు విచారణకు హాజరు కాలేనని, తనకు కనీసం మూడు వారాల సమయం కావాలంటూ సోనియాగాంధీ ఈడి కి సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలో ఆమె అభ్యర్థనకు సానుకూలంగా స్పందించిన ఈడి సోనియా విచారణను వాయిదా వేసింది. అయితే తాజాగా ఈడీ సోనియాగాంధీకి మరోమారు సమన్లు జారీ చేసింది. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈ నెల 21న తమ ముందు విచారణకు హాజరు కావాలంటూ సదరు సమన్లలో వారు సోనియాను ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version