టీఆర్ఎస్ ఎంపీ డీఎస్‌ తో ఈట‌ల భేటీ

-

హుజురాబాద్ ఉప ఎన్నిక‌లలో టీఆర్ఎస్ పై ఘ‌న విజ‌యం సాధించిన బీజేపీ నేత మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ ప్ర‌స్తుతం త‌న‌కు సహ‌కరించిన వారితో వ‌రుస‌గా భేటి అవుతున్నారు. అయితే తాజాగా టీఆర్ఎస్ రాజ్య స‌భ ఎంపీ ధ‌ర్మ పూరి శ్రీ‌నివాస్ ను కూడా బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేంద‌ర్ క‌లిసి స‌మావేశం అయ్యాడు. అయితే హుజురాబాద్ ఉప ఎన్నిక‌ల స‌మ‌యంలో ఈట‌ల‌కు డీఎస్ ఎలాంటి స‌హాయం చేయ‌లేదు. దీంతో వీరి మ‌ధ్య జ‌రుగుత‌న్న ఆక‌స్మ‌తుగా సమావేశం పై రాజ‌కీయ ప్రాధాన్యం సంతరించుకుంది.

అయితే ఈ స‌మావేశం మ‌ర్యాద పూర్వ‌కంగానే ఉంటుంద‌ని వారు తెలిపారు. అయినా ఈ స‌మావేశం పై ప‌లు అనుమానులు వ్య‌క్తం అవుతున్నాయి. అయితే ఈ స‌మావేశానికి ఈట‌ల రాజేంద‌ర్ ను ఎంపీ ద‌ర్మ‌పూరి అర‌వింద్ స్వ‌యం గా తీసుకు వ‌చ్చాడు. దీంతో స‌మావేశం పై ఆస‌క్తి ఇంకా పెరిగింది. కాగ రాజ్య స‌భ ఎంపీ డీ శ్రీ‌నివాస్ గ‌త కొద్ది రోజుల నుంచి టీఆర్ఎస్ పార్టీ కి దూరంగా ఉంటున్నాడు. ఆయ‌న ఏ క్ష‌ణం అయినా టీఆర్ఎస్ పార్టీని వీడే అవ‌కాశం ఉంద‌ని ప‌లువురు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version