మరికొన్ని రోజులు దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి.ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల కోడ్ రానుండటంతో రేపటి నుంచి 3 రోజుల సెలవులను రద్దు చేశారు.కలెక్టరేట్స్, సెక్రటేరియట్ 3 రోజులు పని చేయనున్నాయి. 12న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం వుంది. పార్లమెంట్ తో పాటు వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామని ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది.
2019లో పార్లమెంట్ ఎన్నికలకు మార్చి 10న షెడ్యూల్ ప్రకటించిన ఈసీ.. ఏప్రిల్ 11 నుంచి మే 19 వరకు ఏడు విడతల్లో పోలింగ్ నిర్వహించింది. మే 23న రిజల్ట్స్ ప్రకటించింది. ఇప్పుడు కూడా అదే తరహాలో షెడ్యూల్ విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. దీనిపై మరో రెండు రోజుల్లో అధికారిక ప్రకటన రానుందని వార్తలు వినిపిస్తున్నాయి.