అసెంబ్లీ రద్దయిన ఆరునెలల్లోపే ఎన్నికలు జరపాలని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ ఓపీ రావత్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఎన్నికలు జరగనున్న నాలుగు రాష్ట్రాలతో పాటు తెలంగాణలో ఎన్నికలు జరపాల.. వొద్దా… అనే విషయంపై చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. పరిస్థితులు అనుకూలిస్తే అవసరమైతే తెలంగాణలో ఇతర రాష్ట్రాలకంటే ముందుగానే ఎన్నికలు జరగొచ్చు అంటూ పేర్కొన్నారు. అసెంబ్లీ రద్దయినప్పుడు ఎన్నికలు ఎప్పుడు జరపాలనే నిర్ణయంపై 2002లో రాష్ట్రపతి సుప్రీం కోర్టు నుంచి అభిప్రాయం కోరారు.. దీంతో అసెంబ్లీ రద్దయిన ఆరునెలలలోపే ఎన్నికలు జరపాలని… ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఆరునెలల పాటు అధికారంలో ఉండకూడదని నాడు సుప్రీం వెల్లడించిందని గుర్తు చేశారు.. తెలంగాణలో ఈసీ పై వస్తోన్న అనేక రకాలైన కామెంట్స్ పై మాకు ఎలాంటి సంబంధం లేదన్నారు. నిష్పక్ష పాతంగా రాజ్యంగానికి లోబడి ఎన్నికలు నిర్వహిస్తామని రావత్ ధీమా వ్యక్తం చేశారు.