కరోనా మహమ్మారి నిజంగా అందర్నీ పట్టి పీడిస్తోంది. ఈ కరోనాతో ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయి. ఈ మహమ్మారి సమయం లో ఎవరైనా కరోనా వైరస్ కారణంగా మరణిస్తే ఆ కుటుంబానికి లాభం కలుగుతుంది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే..
ESIC స్కీమ్ ద్వారా ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. ఒక వేళ కనుక ఈ స్కీమ్ లో ఉన్న వ్యక్తి కరోనా తో చనిపోతే అతనికి డిపెండ్ అయ్యే వ్యక్తులకి అంటే.. భార్య, తల్లిదండ్రులు లేదా పిల్లలకి కానీ ఈ డబ్బులు వస్తాయి.
ఇలా ESIC కార్డు హోల్డర్ ఎవరైనా కరొనతో మరణిస్తే తన కుటుంబానికి ఈ ప్రయోజనం కలుగుతుంది. ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ తాజాగా కోవిడ్ 19 రిలీఫ్ స్కీమ్ కింద దీనిని అప్రూవ్ చేసింది.
ఈ స్కీమ్ వలన ప్రయోజనం ఏమిటి అంటే ESIC కార్డ్ హోల్డర్ తర్వాత మరణిస్తే ప్రయోజనకరం కలుగుతుంది. ఒకవేళ కనుక వ్యక్తి మరణిస్తే కుటుంబానికి కనీసం రూ.1800 ప్రతి నెలా అందుతాయి. ఇలా కార్డు హోల్డర్ కుటుంబానికి కాస్త రిలీఫ్ గా ఉంటుంది.