తెలంగాణను చూస్తే…ఉత్తర కొరియా గుర్తుకొస్తుంది : ఈటల రాజేందర్‌

-

17న ఇందిరా పార్కు దగ్గర దీక్ష చేసి..కేసీఆర్‌ కు బుద్ది చెబుతామని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ వార్నింగ్‌ ఇచ్చారు. స్పీకర్ నిర్ణయం ని కోర్ట్ లు సరిదిద్ద లేవని… సరిదిద్దే బాధ్యత స్పీకర్ దే నని కోర్టు చెప్పిందని ఈటల అన్నారు. స్పీకర్ తన గౌరవాన్ని నిలబెట్టుకోలేదు… ఇది నియంతృత్వానికి దారి తీస్తుందని మండి పడ్డారు.

మా ప్రతిపాదన గా సభ అభిప్రాయం కొరమని ఆడిగాము.. పట్టించుకోలేదని ఆగ్రహించారు. ఉత్తర కొరియా గుర్తుకు వస్తుంది…అక్కడ చప్పట్లు కొట్టలేదని కాల్చి చంపారని నిప్పులు చెరిగారు. అసెంబ్లీ లో చప్పట్లు కొట్టలేదని సస్పెండ్ చేసే రోజు వస్తుందేమో అంటూ చురకలు అంటించారు.

మమ్మల్ని సస్పెండ్ చేసిన మంత్రి(తలసాని) …. కేసీఆర్ ను ఎన్ని మాటలు అన్నాడో అందరికి తెలుసు అన్నారు. ప్రజా క్షేత్రంలో శిక్ష తప్పదు.. శిక్ష అనుభవించేది కేసీఆర్ మాత్రమేనని.. ఈ నెల 17 న ఇందిరా పార్కు దగ్గర దీక్ష చేస్తామని ప్రకటన చేశారు. రాజ్యాంగాన్ని పరిరక్షించండి… నియంతృత్వ న్ని బొంద పెట్టండి అనే నినాదంతో దీక్ష చేస్తామని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version