తెలంగాణలో రాజకీయాలు మరింత వేడుక్కుతున్నాయి. హుజూరాబాద్ లో రాజీకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. దీంతో టీఆర్ ఎస్ కేడర్ ఈటల అనుకూల, వ్యతిరేక వర్గాలుగా విడిపోతోంది. మొన్నటి వరకు మంత్రి గంగుల ఈటల అనుచరులతో చర్చలు జరిపి పార్టీ వెంట నడిచేలా చూశారు. అయితే మంత్రి మంతనాలపై నిన్నటి వరకు సైలెంట్‌గా ఉన్న ఈటల.. ఈ రోజు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
మంగళవారం హుజూరాబాద్‌లో ప్రెస్‌మీట్ పెట్టిన ఈటల.. గంగులను టార్గెట్ చేస్తూ వార్నింగ్ ఇచ్చారు. నువ్వు ఏందో నీ కథ ఏందో అందరికీ తెలుసు.. అధికారం శాశ్వతం కాదు. 2023 తర్వాత నువ్వు అధికారంలో ఉండవు… అంటూ గంగులకు గట్టి వార్నింగ్ ఇచ్చారు.
తన అనుచరులను మంత్రి గంగుల కమలాకర్ బెదిరిస్తున్నాడని, వారి జోలికొస్తే ఊరుకునేనేది లేదని హెచ్చరించారు. టైమ్ వచ్చినప్పుడు అన్నీ బయటపడుతాయ్ అంటూ వ్యాఖ్యానించారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, హుజూరాబాద్ ప్రజలు ఆత్మగౌరవాన్ని గెలిపిస్తారంటూ స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలతో ఒక్కసారిగా రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి. ఈటల గేర్ మార్చి డైరెక్ట్‌గానే అటాక్ చేస్తున్నారు.