‘F3’ సెన్సార్ పూర్తి..థియేటర్లలో నవ్వులు నవ్వులే..నిడివి అంతనా?

-

ఇటీవల కాలంలో చక్కటి వినోదాత్మక చిత్రం వెండితెరపైన కనబడలేదు. యాక్షన్, మెసేజ్ ఓరియెంటెడ్ ఫిల్మ్స్ ఎక్కువగా వస్తున్నాయి. కాగా, ఫన్ ప్రధాన అంశంగా తెరకెక్కిన చిత్రం ‘‘F3’’ ఈ సమ్మర్ లో నవ్వులు పూయించే చక్కటి సినిమా అవుతుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తు్న్నారు.

ఈ నెల 27న పిక్చర్ రిలీజ్ కానుండగా, తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ మేరకు ట్వి్ట్టర్ వేదికగా అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చేశారు. ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్ టైనర్ అయిన ఈ మూవీకి సెన్సార్ బోర్డు క్లీన్ U సర్టిఫికెట్ ఇచ్చినట్లు తెలిపారు.

ఈ నెల 27న విడుదల కానున్న ఈ సినిమా నిడివి 2 గంట‌ల 28 నిమిషాలు ఉండ‌నుంది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ పిక్చర్ కు మ్యూజిక్ అందించగా, బ్యూటిఫుల్ హీరోయిన్స్ త‌మ‌న్నా, మెహ్రీన్ తో పాటు సునీల్, సోనాల్ చౌహ‌న్ కీల‌క‌ పాత్రలు పోషించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేష‌న్స్ బ్యానర్ పై ‘ దిల్‌’రాజు, శిరీష్‌ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశారు. ఈ పిక్చర్ కు టికెట్ల ధరలు పెంచబోమని ఇటీవల దిల్ రాజు తెలిపిన సంగతి అందరికీ విదితమే.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version