పుదీనాతో ఫేస్ ప్యాక్..మెరిసిపోయే చర్మం మీ సొంతం..!

-

పుదీనా వంటల్లో వేస్తే ఆ వాసన అమోఘం..బిర్యానీలో అయితే ఇక వేరేగా చెప్పనక్కర్లేదు. కొత్తిమీర- పుదీనా లేకుండా మసాలా ఐటమ్స్ పూర్తికావు. వీటితో అరోగ్యమే కాదు..అందం కూడా మీ సొంతం. పుదీనాకు వంటింట్లో లభించే మరికొన్ని పదార్ధాలు యాడ్ చేసి ఫేస్ ప్యాక్ చేశారంటే..మెరిసిపోయే అందం మీ సొంతం అవ్వాల్సిందే. పార్లర్ చుట్టూ తిరిగే పనిలేకుండా..మీకు కానీ ఇప్పుడు చెప్పుకోబేయో ప్రాబ్లమ్స్ ఉంటే..ఈ ఫేస్ ప్యాక్ ట్రై చేయండి. ఇంకెందుకు ఆలస్యం ఆ ప్యాక్ ఎలా చేయాలి..ఆ సమస్యలు ఏంటో చూసేద్దాం.

నల్లటి వలయాలు మాయం..

కంటికింద నల్లటి వలయాలు ఉంటే..అది మీ అందం మొత్తం చెడగొడుతుంది. అదేదో దెయ్యంలా కనిపిస్తారు కూడా. వీటిని పోగొట్టుకోడానికి ఎన్నో ట్రై చేసి ఉంటారు. పుదీనా ఆకులను మెత్తగా రుబ్బి ముఖానికి పూతలా వేసుకుంటే వృద్ధాప్య ఛాయలు తగ్గుముఖం పడతాయి. ఇది రక్త ప్రసరణ మెరుగుపడేలా చేస్తుందట. కంటి కింద నల్లటి వలయాలూ కూడా తగ్గుతాయి.

మచ్చలు పోతాయి..

మొటిమలు, దోమకాటు వల్ల ఏర్పడే ముఖంపై కొన్ని మచ్చలు ఏర్పడాతాయి. వీటిని నివారించడానికి పుదీనా ఉపయోగపడుతుంది. ఈ ఆకులను ముద్దలా చేసి, అందులో కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి.. సమస్య ఉన్న చోట రాస్తే చాలు మంచి ఫలితం కనిపిస్తుంది.

గ్రీన్‌టీతో..

పుదీనా ఆకుల్లో కొన్ని చెంచాల గ్రీన్‌ టీ వేసి మిశ్రమంలా చేయాలి. దీన్ని చేతులు, మెడకు పూతలా వేస్తే.. కాలుష్యం కారణంగా పేరుకున్న మురికి వదులుతుంది. చర్మం మృదువుగా, తాజాగా మారుతుంది. గ్రీన్ టీతో చర్మసౌందర్యం ఇంకా పెరుగుతుంది. ముఖ్యంగా టాన్ పోగొట్టడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది.

జిడ్డు చర్మతత్వానికి..

కొందరికి ఆయిలీ స్కిన్ ఉంటుంది. ముల్తానీ మట్టిలో సరిపడా పుదీనా రసం కలపాలి. జిడ్డు చర్మతత్వం ఉన్నవారు వారంలో రెండుసార్లు ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుంటే సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.

మాయిశ్చరైజర్‌గా..

పెరుగు, పుదీనా ఆకుల మిశ్రమాన్ని ముఖానికి పూతలా వేసుకుంటే.. చర్మం తేమను సంతరించుకుంటుంది. ఇది సహజ మాయిశ్చరైజర్‌గానూ పనిచేస్తుంది.

మొటిమలకు

మీరు కనుక మొటిమల సమస్యతో బాధపడుతుంటే.. రోజ్ వాటర్, తేనె, పుదీనా ఆకులతో తయారుచేసిన మిశ్రమాన్ని మొటిమలపై రాసి.. మర్దన చేయండి. ఇలా చేస్తుంటే..క్రమంగా అవి తగ్గుముఖం పడతాయి.

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version