ఫ్యాక్ట్ చెక్; అబద్ధం.. కేంద్రం 1000 సహాయం…!

-

కరోనా వైరస్ విస్తరిస్తున్న సమయంలో ఇప్పుడు ప్రచారం లో ఉన్న కొన్ని వార్తలు జనాలను బాగా ఇబ్బంది పెడుతున్నాయి అనేది వాస్తవ౦. ఏదోక ప్రచారం జరుగుతూనే ఉంది. తాజాగా కరోనా సహాయత్ పేరుతో ఒక ప్రచారం జరుగుతుంది. అది ఏంటీ అంటే “కరోనా వేగంగా విస్తరిస్తున్న తరుణంలో కేంద్ర సర్కార్ ప్రజలకు సాయం చేయడానికి గానూ ప్రత్యేకమైన స్కీమ్‌ను ఆవిష్కరించింది. దీని పేరు కరోనా సహాయత్ యోజన.

ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికీ రూ.1,000 చొప్పున కేంద్ర ప్రభుత్వం అందజేస్తుంది. దీనిపై వాట్సాప్ లో ఒక మెసేజ్ వైరల్ అవుతుంది. ఈ మెసేజ్ లో వచ్చే లింక్ మీద క్లిక్ చేస్తే మీకు వెయ్యి రూపాయలు జమ అవుతాయి. స్కీం అందుబాటులో లేని వాళ్ళు ఈ స్కీం లో జాయిన్ అవ్వాలి అని చెప్పారు. దీనిపై కేంద్రం స్పష్టత ఇచ్చింది. అది అంతా తప్పుడు ప్రచారమే గాని వాస్తవం కాదని చెప్పింది.

ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోకు చెందిన ఫ్యాక్ట్ చెక్ యూనిట్ స్పందించింది. అది నిజం కాదని అసలు అలాంటిది ఏమీ కేంద్రం చేయలేదు అని అనవసరంగా నమ్మి ఏ లింక్ పడితే ఆ లింక్ క్లిక్ చేయవద్దు అని చెప్పింది. ప్రజలు అనవసరంగా ఇలాంటి ప్రచారాలను ముందుకు తీసుకుని వెళ్ళకుండా మీకు అలాంటి మెసేజ్ ఏదైనా వస్తే లైట్ తీసుకోవాలని సూచించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version