ఫ్యాక్ట్ చెక్;ఓజోన్ రంధ్రం ఇక లేదు…!

-

దాదాపు 20 ఏళ్ళ నుంచి ఎప్పుడో ఏదోక సందర్భం లోనో వినే మాట ఓజోన్ కి రంద్రం పడింది. అది పూడేది ఎలా అంటూ చాలా మంది ఆవేదన వ్యక్తం చేసారు. అది పూడ్చక పోతే చాలా కష్టం అని హెచ్చరికలు జారీ చేసారు. తాజాగా ఆ రంధ్రం పూడిపోయిందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అది పూడకపోతే జోన్ లేయర్ అనేది సూర్యుడి అతినీల లోహిత కిరణాల (ultraviolet radiation) నుంచి భూమిని, ప్రాణికోటిని కాపాడుతోంది.

ఆ కిరణాలు నేరుగా మన శరీరం మీద పడితే మనకు చర్మ క్యాన్సర్ లు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే అది ఉన్న ప్రదేశంలో మనుషులు ఎవరూ లేరు. దీనితో ఆ ఎండ ఎవరి మీద పడదు. భూమికి ఉత్తరార్ధ గోళంలో ఉన్న ఆర్కిటిక్ హిమ ప్రాంతంపై దానికి రంధ్రం పడింది. చాలా త్వరగా పూడుకుపోయిందని యూరోపియన్ శాటిలైట్ సిస్టం కోపర్నికస్ (Copernicus) ద్వారా బాహ్య ప్రపంచానికి తెలిసింది. అయితే వాట్సాప్ యునివర్సిటి విద్యార్ధులు మాత్రం కరోనా లాక్ డౌన్ వలన కాలుష్యం తగ్గి ఆ రంద్రం మూసుకుపోయిందని చెప్పారు.

కాని అది వాట్సాప్ ఫార్వార్డ్ మెసేజ్ మాత్రమే గాని వాస్తవం కాదని శాస్త్రవేత్తలు చెప్పారు. ఉత్తర ధ్రువంలో ఏర్పడిన పోలార్ వర్టెక్స్ (polar vortex) బలహీన పడటంతో అది మూసుకుపోయిందని… పోలార్ వర్టెక్స్ ఘటనలో ఎత్తైన ప్రదేశాల్లో చల్లటి గాలులు ధ్రువ ప్రాంతాల వరకు వస్తాయి. అవి క్లోరోఫ్లోరోకార్బన్ (CFC)తో కలిసి, ఓజోన్ పొరను నాశనం చేసే అవకాశం ఉంది. ఏప్రిల్‌లో పోలార్ వర్టెక్స్ బలహీన పడటంతో… మూసుకుపోయిందని చెప్పారు. దయచేసి అది ఎవరు అయినా కరోనాతో మూసుకుపోయింది అని చెప్తే నమ్మకండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version