టాలీవుడ్ నటుడు, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పెదనాన కృష్ణం రాజు అనారోగ్యం బారినపడ్డారంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. బాత్రూం లో కాలు జారిపడటంతో కృష్ణం రాజు తుంటి ఎముక విరిగిందంటూ వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ విషయంపై ఆయన కుటుంబ సభ్యులు స్పందించారు. కృష్ణం రాజు ఆరోగ్యపరిస్థితి బాగానే ఉందని చెప్పారు. కేవలం సాధారణ వైద్య పరీక్షల కోసమే ఆస్పత్రికి వెళ్లామని స్పష్టం చేశారు.
కృష్ణం రాజు యూకేకు వెళుతున్నారని ఈ నేపథ్యంలోనే వైద్య పరీక్షలు చేయించుకున్నారని చెప్పారు. అంతే కాకుండా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సాయి ధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై కృష్ణం రాజు అడిగి తెలుసుకున్నారని చెప్పారు. ఇదిలా ఉండగా కృష్ణం రాజు ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నారు. చివరగా ప్రభాస్ హీరోగా నటించిన రెబల్ సినిమాలో నటించారు. ఇక ఆ తరవాత కృష్ణం రాజు మళ్లీ ప్రభాస్ హీరోగా నటిస్తున్న పలు సినిమాలలో నటిస్తున్నారంటూ వార్తలు వినిపించినా ఆ వార్తలపై క్లారిటీ రాలేదు.