సుశాంత్ నక్షత్రం.. అభిమాని అదిరిపోయే గిఫ్ట్..!

-

హీరో సుశాంత్ కోసం అమెరికాలో ఉంటున్న ర‌క్ష అనే అభిమాని ఓ న‌క్ష‌త్రం కొనుగోలు చేశాడు. అందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాన్ని ట్విట్టర్‌‌లో పోస్ట్ చేసి తన అభిమానాన్ని చాటుకున్నారు. ‘సుశాంత్‌ అద్భుతమైన వ్యక్తి. అతనికి నివాళులు అర్పించడంలో కొంత ఆలస్యం చేశాను. ఈ చీకటి ప్రపంచంలో ఆయన ఒక స్వచ్ఛమైన రత్నం లాంటివాడు. ఆయన మరింతగా మెరవాలి. ఇక నుంచి ఆ తార మరింత ప్రకాశవంతంగా మెరువాలి’ అని రక్ష అనే అభిమాని ట్వీట్ చేశారు.

విశ్వంలో ఉండే తారల్లో ఒకటైన RA 22.121 కు జూన్ 25,2020 నుంచి సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌గా నామకరణం చేశారు. ఆ మేరకు ఖగోళ శాస్త్ర సంస్థ మాకు హక్కులు కల్పించింది అని ర‌క్ష పేర్కొన్నారు. అయితే ఖగోళ శాస్త్రంపై ఆసక్తి ఉన్న సుశాంత్ ఇప్పటికే చంద్రమండలంపై భూమిని కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version