ముద్దు గుమ్మలు ఫ్లెక్సీలతో సిద్దిపేటలో వ్యవసాయం

-

తెలంగాణ సిద్దిపేటకు చెందిన ఓ రైతు పంటకు దిష్టి తగల కుండా తాను వేసిన ఎత్తు గడలో సక్సెస్ అయ్యాడు. ఏకంగా అందమైన ముద్దు గుమ్మలను పొలం లో దించి, తనకి నష్టం కలిగించే వారిని ముగ్గులోకి దింపాడు. ఆఖరికి హీరోయిన్ల ను ఈ విధంగా కూడా ఉపయోగించుకోవచ్చని నిరూపించాడు. ఎవరి నుంచి ఆయినా తప్పించు కోవచ్చు గానీ, నరఘోష మహా డేంజర్ అని, అందుకే ఈ పని చేశానని అంటున్నాడు రైతు చంద్రమౌళి.

సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మండలం చంద్ల పూర్ కి చెందిన చంద్ర మౌళి, వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తాడు. అది తప్ప మరొక పని చేతకాదు, తనకున్న రెండు ఎకరాలలో పొలంలో ఈసారి మిర్చి సాగు చేస్తున్నాడు. ప్రతిసారి పంటకు ఏదో ఒక తెగులు సోకి నష్టపోతున్నాడు. నరదిష్టి తగిలే తాను ఇలా నష్టపోతున్నానని భావించిన ఆ రైతు, అందుకు విరుగుడుగా తన పొలం చుట్టూ తమన్నా, కాజల్ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశాడు.

గత కొన్ని ఏళ్ళు గా పొలం లో ఏమి వేస్తున్నా గానీ, లాభం మాట దేవుడెరుగు, కనీసం పెట్టుబడి కూడా రావడం లేదు. పంటల రకాలు మార్చాడు. ఎన్ని విధాలుగా ట్రై చేసినా, ఏమీ లాభం లేకుండా పోయింది. తన తోటి వారందరి పంట బాగానే పండుతుంది.. తనకే ఎందుకు ఇలా జరుగుతుందో అని పూజలు చేసాడు. మొక్కులు మొక్కాడు.

రకరకాల పంటలను ట్రై చేసిన చంద్రమౌళి ఈసారి మిర్చి సాగు చేస్తున్నాడు. వెళ్లే వాళ్ళు, వచ్చే వాళ్ళు అదే పని గా తన పొలం వైపు చూడడం వలన దిష్టి తగిలిందని భావించాడు. దిష్టి పోవాలంటే ఎవరో చెప్పిన మాటలు గుర్తు వచ్చాయి అతనికి. ఆ దారిన పోయే వాళ్ల కళ్ళు తన పొలం పై పడకుండా ఉండాలని భావించి, టాలీవుడ్ ముద్దు గుమ్మలు కాజోల్, తమన్నా ఫ్లెక్సీ లు తెచ్చి పొలం లో పెట్టాడు. అటు ఒక కర్ర ఇటు ఒక కర్ర పాతి రెండు ఫ్లెక్సీ లను తగిలించాడు.
ఆ ఫొటో లతో తనకు నర గోల తగ్గిందంటున్నాడు.

చంద్ర మౌళి ఆలోచన తో ఊళ్ళో రైతులు అందరూ, అలా మనము ఎందుకు చేయకూడదు అనుకుంటున్నారు. వయ్యారాలు ఒలగ బోసే ముద్దు గుమ్మలు ఫ్లెక్సీలను పెట్టె పనిలో ఉన్నారు.చీడ పీడ లు కంటే పాడు కళ్ళు తమ పంట పై పడకుండా జాగ్రత్త పడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version