ఐర్లాండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీ యువకుడు దుర్మరణం

-

ఐర్లాండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఏపీకి చెందిన ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. మృతుడు కృష్ణా జిల్లా జగ్గయ్య పేటకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. జగ్గయ్య పేటకు చెందిన భార్గవ్ ఉన్నత చదువుల కోసం ఐర్లాండ్ వెళ్ళినట్లు సమాచారం.

శుక్రవారం రాత్రి స్నేహితులతో కలిసి భార్గవ్ బయటకి వెళ్లగా వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భార్గవ్ అక్కడికక్కడే మృతి చెందగా..తోటి స్నేహితులకు తీవ్రగాయాలైనట్లు తెలుస్తోంది.మృతుల సంఖ్య పెరిగే చాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, చేతికి అందివచ్చిన కొడుకు చనిపోవడంతో భార్గవ్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.తన కుమారుడి మృతదేహాన్ని ఇండియాకు తీసుకొచ్చేలా చూడాలని కుటుంబసభ్యులు ఏపీ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version