తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ ప్రాంతంలో ఉన్న కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు ఎంఐఎం పార్టీకి కంచుకోటలుగా ఉన్న విషయం తెలిసిందే. మొదట నుంచి ఆ నియోజకవర్గాల్లో ఎంఐఎం హవా కొనసాగుతూనే వస్తుంది. ఆ నియోజకవర్గాల్లో మరో పార్టీ గెలవడం చాలా కష్టమైపోతుంది.మలక్‌పేట్, నాంపల్లి, కార్వాన్, ఛార్మినార్, చాంద్రాయణగుట్ట, యాకుత్‌పురా, బహదూర్‌పురా నియోజకవర్గాల్లో ఎంఐఎంకి తిరుగులేని బలం ఉంది. ఈ నియోజకవర్గాల్లో ఆ పార్టీ గెలుపు ఆపడం వేరే పార్టీలకు చాలా కష్టం. పైగా అధికార టిఆర్‌ఎస్ సైతం ఈ ఏడు నియోజకవర్గాల్లో ఏదో నామ మాత్రంగానే పోటీలో ఉంటుంది.
ఇక 2018 ఎన్నికలోచ్చేసరికి ఫిరోజ్ కాంగ్రెస్ తరుపున పోటీ చేసి ఎంఐఎం అభ్యర్ధి జాఫర్ హుస్సేన్ చేతిలో 10 వేల ఓట్ల మెజారిటీతో ఓడిపోయారు. అయితే ఈ సారి ఎలాగైనా ఇక్కడ ఎంఐఎంకి చెక్ పెట్టాలని ఫిరోజ్ ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో దూకుడుగా పనిచేస్తున్నారు. పైగా రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయ్యాక ఎంఐఎం స్థానాలపై కూడా స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే తమకు పట్టున్న నాంపల్లిలో ఈ సారి ఎలాగైనా కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని చూస్తున్నారు. మరి చూడాలి ఈ సారి ఎంఐఎం అడ్డాలో ఫిరోజ్ హవా ఉంటుందో లేదో?