హైదరాబాద్‌ వాసులకు అలర్ట్‌.. నేడు పలు ఎంఎంటీఎస్‌ సర్వీసులు రద్దు..

-

హైదరాబాద్‌ వాసులకు దక్షిణ మధ్య రైల్వే మరో షాక్‌ ఇచ్చింది. ఈ ఆదివారం కూడా పలు ఎంఎంటీఎస్‌ సర్వీసులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. గ్రేటర్‌లో తిరిగే ఎంఎంటీఎస్లలో 6 సర్వీసులను నేడు రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. అలాగే హైదరాబాద్ – లింగంపల్లి మధ్య 47108 నంబరుతో నడిచే రైలును ఉదయం 10.55కి బదులు మధ్యాహ్నం 12.30 గంటలకు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. అయితే.. రద్దయిన రైళ్లలో లింగంపల్లి – పలక్‌నుమా- లింగంపల్లి మధ్య తిరిగే 4 సర్వీసులు, లింగంపల్లి-హైదరాబాద్-లింగంపల్లి మధ్య రెండు సర్వీసులు ఉన్నట్లు పేర్కొన్నారు దక్షిణ మధ్య రైల్వే అధికారులు.

మెయింటెనెన్స్ పనుల కారణంగా ఈ రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని అధికారులు కోరారు. ఇదిలా ఉంటే.. దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ట్రాల్లోని ఇప్పటికే పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు ప్రవేశపెట్టగా… దీపావళి నేపథ్యంలో మరికొన్ని స్పెషల్ ట్రైన్స్ ను ప్రకటించింది. ఇందులో భాగంగా సికింద్రాబాద్ – తిరుపతి, సికింద్రాబాద్ – సంత్రగాచి, నర్సాపూర్ – సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లను నడపనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version