ఫైబ‌ర్ గ్యాస్ సిలిండ‌ర్ లు వ‌చ్చేశాయ్..10kg ల సిలిండ‌ర్ కేవ‌లం రూ.659..!

-

ప్ర‌స్తుతం మ‌నం ఉప‌యోగిస్తున్న గ్యాస్ సిలిండ‌ర్ లు లోహ‌పు సిలిండ‌ర్ లు. ఇవి ఎంతో బ‌రువుగా ఉంటాయి. సిలిండ‌ర్ ను లేపాలంటే ఇద్ద‌రు వ్య‌క్తులు కావాల్సిందే. ఇక లోహ‌పు సిలిండ‌ర్ కావ‌డంతో తుప్పు ప‌ట్ట‌డం దాంతో గ‌చ్చుపై మ‌ర‌క‌లు అవ్వడం క‌నిపిస్తుంది. అయితే ఈ బాధ‌లు అన్నీ ఇప్పుడు తీర‌నున్నాయి. తాజాగా హైద‌రాబాద్ మార్కెట్ లోకి ఫైబ‌ర్ గ్యాస్ సిలిండ‌ర్ లు వ‌చ్చాయి. ఇండియ‌న్ ఆయిల్ కార్పోరేష‌న్ తేలికైన ఫైబ‌ర్ సిలిండ‌ర్ ల‌ను హైద‌రాబాద్ లో ప్ర‌వేశ‌పెట్టింది.

బుల్లెట్ ప్రూఫ్ ఫైబ‌ర్ తో ఈ సిలిండ‌ర్ ల‌ను త‌యారు చేశారు. 5, 10 కేజీల వేరియంట్ ల‌లో ఈ సిలిండ‌ర్ లు అందుబాటులో ఉన్నాయి. వీటి బ‌రువు మ‌నం ప్ర‌స్తుతం వినియోగిస్తున్న సిలిండ‌ర్ ల‌తో పోలీస్తే 50శాతం త‌క్కువ ఉంటుంది. అంతే కాకుండా ఈ సిలిండ‌ర్ లో గ్యాస్ లెవ‌ల్ ఎక్క‌డి వ‌ర‌కూ ఉన్న‌ది కూడా పై లేయ‌ర్ చూసి తెలుసుకోవ‌చ్చు. ఇక పదికేజీల ఫైబ‌ర్ సిలిండ‌ర్ ధ‌ర కూడా కేవ‌లం రూ.659.50 కావ‌డం విశేషం.

Read more RELATED
Recommended to you

Exit mobile version