తెలంగాణ పోలీస్ శాఖలో తొలి కరోనా కేసు…!

-

తెలంగాణాలో కరోనా వైరస్ క్రమంగా పెరుగుతుంది. పాజిటివ్ కేసుల సంఖ్య 364కి చేరింది. ఒక్కరోజే 30 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో తెలంగాణా ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తుంది. 12 మంది సోమవారం ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకు 45 మంది పూర్తిగా కోలుకొని ఇళ్ళకు వెళ్ళిపోయారు. 11 మంది తెలంగాణా ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో 308 మంది కరోనాతో పోరాడుతున్నారు.

ఇక ఈ వైరస్ పోలీస్ శాఖకు కూడా సోకింది. సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్‌కు కరోనా పాజిటివ్ వచ్చినట్టు పోలీస్ ఉన్నతాధికారులు మీడియాకు తెలిపారు. దీనితో అప్రమత్తమైన రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ అధికారులు వెంటనే చర్యలకు దిగారు. హెడ్ కానిస్టేబుల్‌ ఆయనకు దగ్గరగా ఉన్న 12 మంది సిబ్బందిని క్వారంటైన్ సెంటర్‌కు తరలించారు.

అలాగే 10 మంది కుటుంబ సభ్యులను కూడా క్వారంటైన్ సెంటర్‌కు తరలించి పరీక్షలు నిర్వహిస్తున్నారు. అతను ఢిల్లీ మత ప్రార్ధనలు చేసిన వారిని కలిసి ఉండవచ్చు అనే అనుమానాలు వ్యకతమవుతున్నాయి. సదరు కానిస్టేబుల్ ఎక్కడికి వెళ్లలేదని అంటున్నారు అధికారులు. ఎక్కడికక్కడ అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news