ఏపీలో మరో రాజకీయ పార్టీ ఏర్పాటు అయింది. జైభీమ్ భారత్ పేరుతో.. మాజీ న్యాయమూర్తి జడ శ్రవణ్ కుమార్ ఏర్పాటు చేశారు. అయితే.. ఈ సందర్భంగా జై భీమ్ పార్టీ వ్యవస్థాపకుడు జడ శ్రవణ్ కుమార్… మాట్లాడుతూ… రాష్ట్రంలో పొలిటికల్ వాక్యూమ్ ఉందా అని ప్రశ్నిస్తున్నారని.. దళితుల కోసం పోరాడే పార్టీ ఒక్కటి కూడా రాష్ట్రంలో లేదని పేర్కొన్నారు.
28 ఏళ్లకు న్యాయమూర్తిని అయిన వ్యక్తిని తానని.. పదేళ్లల్లో ఆ పదవిని వదిలి వచ్చానన్నారు. రూపాయికి కిలో బియ్యం, 200 రూపాయలకు ఆయిల్ ప్యాకేట్ ఇచ్చే పార్టీ లను మనం పొగుడుదామా? దళిత బిడ్డలకు మేనమామ అని చెప్పిన జగన్.. ఆ తరువాత చేసిన అన్యాయం ఎవ్వరు మర్చిపోరని వెల్లడించారు.
వైసీపీ దుర్మార్గ పాలనను మనం ప్రశ్నించవద్దా..? ఆ పార్టీ లోని దళిత నాయకులను ఓడించడానికే ఈ పార్టీ అని వెల్లడించారు. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు ప్రజలకు అన్యాయం చేసే వారిని ప్రశ్నిస్తానిన స్పష్టం చేశారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రితో సబ్ ప్లానుపై ఎక్కడైనా చర్చిస్తానని.. 26 రకాల దళిత స్కీములను జగన్ రద్దు చేశారన్నారు. విదేశీ విద్య కోసం వెళ్లిన వారు ప్రభుత్వం నుండి నిధులు రాక ఇబ్బంది పడుతున్నారని.. ఓడిపో, ఓడించు, గెలువు అనే కాన్షిరాం మాటలే మాకు స్ఫూర్తి అని తెలిపారు.