ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఏపీలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా పోలవరం, అమరావతి పై ఇప్పటికే శ్వేతపత్రాలు విడుదల చేసారు సీఎం చంద్రబాబు. మరోవైపు అబివృద్ది పై దృష్టి సారిస్తున్నారు. మరోవైపు వైసీపీ కార్యాలయాలు కూల్చి వేయడం పై కోర్టులో కేసు నడుస్తోంది.
గుడివాడ అమర్నాథ్ కూటమి ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కూటమి నేతలు ప్రస్తుతం హనీమూన్ లో ఉన్నారని.. వారి హనీమూన్ ఐపోగానే తమ యాక్షన్ ప్లాన్ మొదలు పెడతామని మాజీ మంత్రి అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే తమ ప్రభుత్వం హయాంలో మంచి పాలన అందించామని వాలంటీర్ల ప్రజలకు మేలు జరిగినప్పటికీ.. పార్టీకి మాత్రం నష్టపోయిందని.. ఎన్నికల్లో ఓటమి చెందిన అందరు నాయకులకు వాలంటీర్లపై ఇదే అభిప్రాయం ఉందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని విధంగా ఓటమి చెందామని.. దానికి గల కారణాలను పార్టీ విశ్లేషించుకుంటోందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు.