మంత్రి కేటీఆర్ పై బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు. మునుగోడు ఉప ఎన్నికల ఫలితాలు అనంతరం మంత్రి కేటీఆర్, వివేక్ పై పలు కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలను వివేక్ తీవ్రంగా ఖండించారు. కేటీఆర్ చేసిన ఆరోపణలలో ఏ ఒక్కటి కూడా నిజం కాదని స్పష్టం చేశారు.
కోకాపేటలో తమ కంపెనీ కోసం ల్యాండ్ కొనుగోలు చేస్తే.. మంత్రి కేటీఆర్ హవాలా లావదేవీలు జరిగాయి అంటూ తప్పుడు ప్రకటన చేశారని మండిపడ్డారు. అలాగే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి తన డబ్బులు ఇచ్చానని కేటీఆర్ ఆరోపించడాన్ని వివేక్ ఖండించారు. ఫ్రస్ట్రేషన్ లో కేటీఆర్ తమపై లేనిపోని ఆరోపణలు చేశారని మండిపడ్డారు. మునుగోడు ఉప ఎన్నికలలో నైతిక విజయం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిదేనన్నారు.
కమ్యూనిస్టు పార్టీలతో పొత్తు పెట్టుకోని, పోలీసుల సహాయంతో మునుగోడులో టిఆర్ఎస్ గెలిచిందన్నారు. పోలింగ్ రోజు కూడా ఇతర నియోజకవర్గాలకు చెందిన టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మునుగోడు లోనే తిష్ట వేసి విచ్చలవిడిగా డబ్బులు, మద్యం పంచిపెట్టారని ఆరోపించారు. మునుగోడు లో టిఆర్ఎస్ గెలుపును కేటీఆర్ గొప్పగా చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు.