బీటెక్ చదివారా.. ఫ్రీగా ట్రైనింగ్.. ఆ పై ఉద్యోగం కూడా !

-

ఇంజినీరింగ్ అనేది ఈరోజుల్లో కామన్ అయ్యింది. కానీ ఇంజినీరింగ్ చదివినా ఉద్యోగం అంత సింపుల్ గా రావడం లేదు. కేవలం డిగ్రీ పట్టా చేతిలో ఉంటే చాలదు. ఉద్యోగానికి అవసరమైన ఇతర అంశాల్లోనూ ప్రావీణ్యం ఉండాలి. అందుకే అలాంటి ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు హైదరాబాద్ లో ఓ సంస్థ ముందుకువచ్చింది.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బీటెక్ ఉత్తీర్ణులైన నిరుద్యోగ యువతీ, యువకులకు టెక్ మహీంద్ర ఫౌండేషన్ సహకారంతో ఉపాధి శిక్షణ కల్పిస్తోంది. నిర్మాణ్ సంస్థ. హెబీఎంఎల్, సీఎస్ఎస్, బూటలాప్, కోర్ జావ (ఊప్స్), ఆండ్రాయిడ్ అప్లికేషన్ డెవలప్మెంట్, పీహెచ్పీ, డిజిటల్ మార్కెటింగ్ అంశాల్లో ఉచితంగా శిక్షణ ఇస్తారట.

అంతే కాదు.. ఇంటర్వ్యూల్లో విజయం సాధించేందుకు బిజినెస్ ఇంగ్లిష్, ఇంటర్వ్యూ స్కిల్స్ తదితర కోర్సుల్లో నూ ఉచితంగా శిక్షణ ఇస్తున్నట్టు సంస్థ నిర్వాహకుడు కె.నిరంజన్‌యాదవ్ఓ ప్రకటనలో తెలిపారు. శిక్షణ అనంతరం ఉపాధి కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు. ఆసక్తి గల వారు ఈ నెల 12 లోపు ఫోన్ నంబర్లు 76759 14735, 76759 14738 ద్వారా పేర్లు నమోదు చేసుకోవాలని చెబుతున్నారు.

హైదరాబాద్ లో నివాసం ఉండే బీటెక్ బాబులకు ఈ ప్రకటన నిజంగా చాలా మేలు చేస్తుంది. ఉచితంగా శిక్షణ పొంది.. ఆ తర్వాత ఉద్యోగం కూడా సంపాదించే ఈ ఛాన్స్ మిస్ చేసుకోకండి మరి.

Read more RELATED
Recommended to you

Exit mobile version