మెగాస్టార్ కు తల్లిగా గంగవ్వ..!

-

మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం చిరంజీవి మోహన రాజ దర్శకత్వంలో గాడ్ ఫాదర్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఊటీ లో జరుగుతుండగా ఈ చిత్రానికి సంబంధించి ఓ కీలక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

గాడ్ ఫాదర్ సినిమాలో మెగాస్టార్ కు తల్లిగా “మై విలేజ్ షో” యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న గంగవ్వ తల్లి గా నటిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం గంగవ్వ కూడా ఊటీ లో ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. మై విలేజ్ షో ద్వారా పాపులర్ అయిన తర్వాత గంగవ్వ బిగ్ బాస్ లోకి వచ్చి తెలుగు ప్రేక్షకులను అలరించింది. ఇక ప్రస్తుతం సినిమాల్లోనూ గంగవ్వ ఫుల్ బిజీగా ఉంది. ఇక ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ సినిమాలో గంగవ్వ నటించే ఛాన్స్ కొట్టేసింది.

Read more RELATED
Recommended to you

Latest news