గ్రామాల అభివృద్దే మా ధ్యేయం : మంత్రి గంగుల

-

కరీంనగర్ నియోజకవర్గంలో శనివారం రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్దే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమనీ, సీఎం కేసీఆర్ తీసుకుంటున్న చర్యలతో గ్రామాల రూపురేఖలు మారాయని అన్నారు. నియోజకవర్గంలోని కరీంనగర్ పట్టణంతో పాటు పలుగ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు మంత్రి గంగుల. తొలుత నగరంలోని 17వ డివిజన్ లోని శ్రీరామ్ నగర్ కాలనీలో పర్యటించిన మంత్రి… సుమారు 50 లక్షలతో నిర్మించనున్న… సీసీ రోడ్డు… డ్రైనేజీ నిర్మాణ పనులకు భూమి పూజ నిర్వహించి పనులను ప్రారంభించారు.

పనులను త్వరగా చేపట్టి త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు కాంట్రాక్టర్ కు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం కొత్తపల్లి మండలంలో పర్యటించిన మంత్రి గంగుల కొత్తపల్లి మున్సిపల్ పరిధిలోని వెలిచాల ఎక్స్ రోడ్డు వద్ద 4 కోట్ల 40 లక్షల రూపాయల నిధులతో నూతనంగా నిర్మించనున్న రోడ్ డ్యామ్ పనులకు భూమి పూజ నిర్వహించి శంకుస్థాపన చేశారు. కరీంనగర్ కు వచ్చే ప్రతి ప్రధాన రహదారిలో సెంట్రల్ లైటింగ్ ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇప్పటికే రేకుర్తి నుంచి యూనివర్సిటీ మీదుగా, మరోవైపు పద్మనగర్ నుండి ఒద్యారం వరకు సెంట్రల్ లైటింగ్ పనులు పూర్తి చేసుకుని ప్రారంభించుకున్నామన్నారు.

 

బొమ్మకల్ నుండి ముగ్ధుంపూర్ వరకు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని, ఇప్పుడు కొత్తపల్లి సహజ కాలేజీ నుండి వెలిచాల ఎక్స్ రోడ్డు వరకు 5.50 లక్షలతో సెంట్రల్ లైటింగ్ నిర్మాణ పనులు చేపట్టి ఆగష్టు 15వ తేదీలోగా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. గ్రామాల అభివృద్దే మా ధ్యేయమన్న మంత్రి గంగుల తెలంగాణ ప్రభుత్వం… గ్రామాలు ఇంతగా అభివృద్ధి చెందుతాయని ఎప్పుడైనా ఊహించామా అన్నారు… ప్రతి గ్రామంలో అడుగకున్నా… ఇంకా చాలు అనేలా రోడ్లు వేశామన్నారు. అన్నివర్గాల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వధ్యేయమని… మన ఫ్రభుత్వాన్ని కాపాడుకోవల్సిన బాధ్యత మన అందరి పై ఉందన్నారు. గతంలో ఎండ కాలం వస్తే బీళ్ళు పడ్డ చెరువులు కనిపించేవని… కానీ సిఎం కెసిఆర్ పాలనలో కాళేశ్వరం జలాలు తీసుకువచ్చి మండుటెండల్లో సైతం మత్తడి దూకిస్తున్నామన్నారు. దీంతో గ్రామాల్లో తాగు… సాగునీరు ఇబ్బందులు లేకుండా పోయాయన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version