వాటే LIC స్కీమ్.. రూ.200 ఇన్వెస్ట్‌మెంట్‌తో 28 లక్షల బెనిఫిట్‌..!

-

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నో రకాల సేవలని అందిస్తోంది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వివిధ రకాల బీమా పాలసీలను తీసుకు వస్తూనే వుంది. అయితే వీటిల్లో పెట్టుబడి పెట్టడం పూర్తి సురక్షితం. ఏ రిస్క్ కూడ ఉండదు. అలానే భవిష్యత్తు అవసరాల కోసం ఈ డబ్బులని మనం ఉపయోగించుకోవడానికి కూడా అవుతుంది.

ఎల్‌ఐసీ జీవన్ ప్రగతి ప్లాన్‌ వలన చాలా లాభాలు వున్నాయి. ఇక పూర్తి వివరాలని చూస్తే.. ఎల్‌ఐసీ జీవన్ ప్రగతి ప్లాన్‌ని తీసుకుంటే చక్కటి బెనిఫిట్స్ కలుగుతాయి. రోజుకు 200 రూపాయలు అంటే నెలకి ఆరు వేలుని డిపాజిట్ చెయ్యాల్సి వుంది. ఏడాదికి 72 వేల రూపాయలు. ఇలా మీరు ఈ స్కీమ్ లో పెడితే 20 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మీకు బోనస్ తో కలిపి రూ. 28 లక్షలు వస్తాయి.

ఈ ప్లాన్‌లో రిస్క్ కవర్ ప్రతి 5 సంవత్సరాలకు పెరుగుతుంది. ఒకవేళ పాలసీదారు మరణించినట్లయితే కుటుంబానికి లేదా నామినీకి బోనస్ హామీ వస్తుంది. రూ.4 లక్షల బీమా పాలసీని కనుక కొంటే 5 సంవత్సరాల తర్వాత అది రూ.5 లక్షలు అవుతుంది. అదే 10 నుంచి 15 ఏళ్లకు అయితే రూ.6 లక్షలు, 20 ఏళ్లలో రూ.7 లక్షలు అవుతుంది. 12 నుంచి 45 ఏళ్ల లోపు వాళ్ళు దీన్ని తీసుకోవచ్చు. ఇందులో త్రైమాసిక, అర్ధ సంవత్సరం, వార్షిక ప్రాతిపదికన డిపాజిట్ చేయవచ్చు. కనిష్ట హామీ మొత్తం 1.5 లక్షలు.

Read more RELATED
Recommended to you

Exit mobile version