రిస్క్ లేకుండా ప్రాఫిట్ వచ్చే పథకాల గురించి మీరు చూస్తున్నారా..? అయితే ఈ స్కీమ్ గురించి చూడాల్సిందే. మనకి అందుబాటులో వున్నా స్కీమ్స్ లో సుకన్య సమృద్ధి యోజన కూడా ఒకటి. సుకన్య సమృద్ధి అకౌంట్ తో సూపర్ బెనిఫిట్స్ ని పొందొచ్చు. చిన్న పొదుపు పథకాల్లో ఇన్వెస్ట్ చేసే వారికి ఈ స్కీమ్ బాగుంటుంది. భారత ప్రభుత్వం అందిస్తున్న పథకాల్లో ఇది కూడా ఒకటి. ఆడపిల్లకు ఆర్థిక ప్రోత్సహం అందించే ఉద్దేశంతో ఈ పథకాన్ని తీసుకొచ్చారు.
ఆడపిల్ల 14 ఏళ్ల వయసు వచ్చేసరికి ఇందులో ఇన్వెస్ట్ చేయొచ్చు. 18 ఏళ్ల వయసు వచ్చే సరికి మెచ్యూరిటీ అమౌంట్‌లో 50 శాతం వరకు విత్‌డ్రా చెయ్యవచ్చు. 21 ఏళ్లు వచ్చే సరికి మొత్తం మెచ్యూరిటీ అమౌంట్ వస్తుంది. వడ్డీ రేటు 8 శాతంగా ఉంది. ఇది ప్రతి త్రైమాసికానికి ఒకసారి ఇస్తారు. ప్రస్తుతం 8 శాతంగా వుంది వడ్డీ. గరిష్టంగా ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలకు ఈ అవకాశం ఉంటుంది.
ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ.1.50 లక్షల వరకు డబ్బులు పెట్టవచ్చు. పోస్టాఫీస్ లేదా బ్యాంక్‌లో ఈ ఖాతా తెరవొచ్చు. గరిష్టంగా రూ.1.50 లక్షల వరకు పన్ను ప్రయోజనాలు కూడా. నెలకు రూ.10 వేల చొప్పున ఇన్వెస్ట్ చేస్తే సంవత్సరానికి రూ.1.20 లక్షలు అవుతాయి. 15 సంవత్సరాల లెక్కన మీరు రూ.18 లక్షలు. వడ్డీనే రూ.33,03,707 వస్తుంది. రూ. 33 లక్షలకుపైగా వడ్డీ వస్తుంది. పాపకు 21 ఏళ్లు వచ్చే సరికి చేతికి మొత్తం రూ.51 లక్షలు మీకు వస్తాయి. ఇక నెలకు రూ.5 వేల చొప్పున కడితే రూ.25 లక్షల వరకు వస్తాయి.