ఎన్నో స్కీమ్స్ ని పోస్ట్ ఆఫీస్ అందిస్తోంది. ఈ స్కీమ్స్ లో చేరితే కచ్చితమైన రాబడి వస్తుంది. అలానే రిస్క్ అనేది ఉండదు. పోస్ట్ ఆఫీస్ అందించే స్కీమ్స్ లో నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ కూడా ఒకటి. ఈ స్కీమ్ లో డబ్బులు పెడితే పలు రకాల ప్రయోజనాలు పొందొచ్చు.
ఇక ఈ స్కీమ్ కి సంబంధించి పూర్తి వివరాలని చూస్తే.. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ స్కీమ్‌పై 7 శాతం వడ్డీ వస్తోంది. రూ. 1000 ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ కి రూ. 1403 లభిస్తాయి. అంటే మీకు వడ్డీ రూపంలో రూ. 403 లభిస్తున్నాయి. స్కీమ్ మెచ్యూరిటీ కాలం ఐదేళ్లు.
ఈ స్కీమ్ పైన వడ్డీ ప్రతి మూడు నెలలకు ఒకసారి మారుతూ ఉంటుంది. ఈ స్కీమ్ లో మీరు సింగిల్‌గా లేదా జాయింట్‌గా అకౌంట్ తెరవచ్చు. మైనర్ల పేరుపై కూడా ఈ స్కీమ్ తెరవచ్చు. పదేళ్లకు పైన వయసు ఉన్న వారు వారి పేరుపైన ఈ స్కీమ్ ఓపెన్ చెయ్యచ్చు. ఈ స్కీమ్ లో రూ. 1000 పెట్టి చేరచ్చు.
ఇందులో ఎంత డబ్బులైన పెట్టచ్చు. గరిష్ట పరిమితి లేదు. రూ. 5 లక్షలు డిపాజిట్ చేస్తే మెచ్యూరిటీ కల్లా రూ. 7 లక్షలకు పైగా వస్తాయి. వడ్డీ రూపంలోనే మీకు రూ. 2 లక్షలకు పైగా వస్తాయి. ఇందులో డబ్బులు పెట్టి రూ. 1.5 లక్షల వరకు పన్ను ఆదా చేసుకోవచ్చు.