వరద దెబ్బ : సీఎం రిలీఫ్ ఫండ్ కి నెల జీతం విరాళం ఇచ్చిన జిహెచ్ఎంసి కార్పొరేట‌ర్లు

-

హైదరాబాద్ లో మొన్న వచ్చిన వర్షం, వరద నెవెర్ బిఫోర్ ఎవర ఆఫ్టర్ అన్నట్టు వచ్చింది. వర్షాలు పడి నాలుగు రోజులు దాటుతున్నా ఇంకా కొన్ని కాలనీల్లో నీళ్ళు నిలిచే ఉన్నాయంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ఇప్పటికే ఆ వరద నీటిని బయటకు పంపడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఈ వరద దెబ్బకి సీఎం రిలీఫ్ ఫండ్ కి ఒక నెల వేత‌నం విరాళంగా ఇచ్చారు జిహెచ్ఎంసి కార్పొరేట‌ర్లు. మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ ఆధ్వ‌ర్యంలో మంత్రి కె.టి.ఆర్‌కు చెక్ అంద‌ చేశారు.

జిహెచ్ఎంసిలో ఉన్న 150 మంది కార్పొరేటర్లలో ప్రస్తుతానికి మేయర్ కు రూ. 50,000/-, డిప్యూటీ మేయర్ కు రూ. 25000/-,లు నెలకు గౌరవ వేతనంగా పొందుతున్నారు. 148 కార్పొరేటర్లకు మ‌రియు 5 మంది కో-ఆప్ష‌న్ స‌భ్యుల‌కు ఒకొక్క‌రికి నెల‌కు రూ. 6వేల చొప్పున గౌవ‌ర వేతనం ఇస్తున్నారు. అలా మేయ‌ర్‌, డిప్యూటి మేయ‌ర్, కార్పొరేట‌ర్లు, కో-ఆప్ష‌న్ స‌భ్యులు మొత్తం 155 మంది త‌మ‌కు నెల‌కు గౌర‌వ వేత‌నంగా ల‌భిస్తున్న మొత్తం రూ. 9,93,000/-ల‌‌ను ముఖ్య‌మంత్రి స‌హాయ నిధికి అందించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version