హైదరాబాద్ లో మరో దారుణం ; ప్రియుడు రూమ్ లో ప్రియురాలు ఆత్మహత్య

-

హైదరాబాద్‌ లో దారుణంలో చోటు చేసుకుంది. ఓ యువతి ఏకంగా లవర్‌ రూమ్‌ కు వెళ్లి సుసైడ్‌ చేసుకుంది. ఈ ఘటన పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఇవాళ ఉదయం చోటు చేసుకుంది. ఈ ఘటన వివరాల్లోకి వెళితే… పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధి లో జ్యోతి అనే యువతి ఆత్మహత్య సుసైడ్‌ చేసుకుంది. తన ప్రియుడు రూమ్ కి వెళ్లి మరీ ఆత్మహత్య చేసుకుంది యువతి జ్యోతి.

మృతురాలు జ్యోతి కి 10 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. జ్యోతి కి.. భర్త విజయ్ కుమార్, ఇద్దరు పిల్లలు ఉన్నారు… సెంట్రల్ మాల్ లో జ్యోతి కొన్ని రోజులుగా పని చేస్తుంది. గత కొంతకాలం నుంచి రాజు అనే యువకుడితో జ్యోతి కి ప్రేమ వ్యవహారం నడిపింది. అయితే.. వారిందరీ మధ్య గత రెండు రోజుల నుంచి కాస్త దూరం పెరిగిందని సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలో ఇవాళ రాజు గదిలో జ్యోతి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అటు రాజు వేధింపుల వల్ల జ్యోతి చనిపోయిందని ఆరోపిస్తున్నాడు భర్త విజయ్. దీని పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version