బాయ్ ఫ్రెండ్ చేయి కోసేసిన ప్రేయసి.. ఆ తర్వాత ఏం చేసిందంటే..?

-

ఓ ప్రేమ జంట తమ పెళ్లికి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదని ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు. అందుకోసం ఇంట్లో నుంచి బైటకి వెళ్ళారు. ఈ క్రమలోనే ఆ యువతి తన బాయ్ ఫ్రెండ్ చేతి మణికట్టుని బ్లేడ్ తో కొసేసింది. తర్వాత తాను ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన  కేరళలో కోజికోడ్​ జిల్లాలో జరిగింది.

పోలీసుల వివరాల ప్రకారం.. కొడంచెరీకి చెందిన ఒక యువతి ఓ యువకుడితో రిలేషన్​షిప్​లో ఉంది. ఈ విషయం ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదు. దీంతో ఇద్దరూ కలిసి చనిపోవాలని నిర్ణయించుకున్నారు. తామరస్సెరీ బస్టాండ్​ వద్ద బస్​ కోసం ఎదురుచూస్తున్నారు. ఇంతలో అకస్మాత్తుగా యువతి రేజర్ బ్లేడ్ ​తీసి తన బాయ్​ఫ్రెండ్​ చేతి మణికట్టును కట్​ చేసింది. ఆపై తాను కూడా ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. దీంతో స్థానికులు ఇద్దరినీ కాపాడి.. తామరస్సే తాలూక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version