దేవుడి భూమి కబ్జా చేయడానికి దేవుడ్నే చంపేసాడు…!

-

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దేవుడి భూమిని కబ్జా చేయడానికి ఏకంగా దేవుడ్నే చంపేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోలో ఒక ఆలయ భూమిని లాక్కోవడానికి ఈ ప్లాన్ వేసారు. అసలు ఏం జరిగింది ఏంటీ అనేది చూద్దాం… లక్నోలోని మోహన్‌లాల్‌గంజ్ ప్రాంతంలోని కుష్మౌరా హలువాపూర్ గ్రామంలోని ఆలయానికి సంబంధించినదిఈ కేసు. 100 సంవత్సరాల పురాతన ఆలయం ఇది.

ఈ ఆలయాన్ని నడుపుతున్న ట్రస్ట్ మొదట శ్రీకృష్ణ-రాముడి పేరిట నమోదు చేయగా… కొంతకాలం తరువాత, గయ ప్రసాద్ అనే వ్యక్తిని శ్రీకృష్ణ-రాముడి తండ్రిగా రికార్డులో చేర్చారు. 1987 లో కన్సాలిడేషన్ ప్రక్రియలో, దేవుడు చనిపోయినట్లు ప్రకటించారు. ఆ తర్వాత ట్రస్ట్ గయా ప్రసాద్ పేరిట బదిలీ చేసారు. 1991 లో, గయా ప్రసాద్ కూడా చనిపోయినట్లు ప్రకటించారు. అతని సోదరులు రామ్‌నాథ్ మరియు హరిద్వార్ పేరిట ట్రస్ట్ బదిలీ చేసారు.

ఆలయ ఒరిజినల్ ట్రస్టీ సుశీల్ కుమార్ త్రిపాఠి 2016 లో నాయబ్ తహశీల్దార్‌కు ఫిర్యాదు చేసినప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే, ఈ కేసులో ఎటువంటి పురోగతి లేకుండా తహశీల్దార్ నుంచి జిల్లా మేజిస్ట్రేట్ ద్వారా ఉప ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్ళింది. డిప్యూటీ సిఎం దినేష్ శర్మ దర్యాప్తును ఎస్‌డిఎం ప్రఫుల్లా త్రిపాఠికి బదిలీ చేయగా… 0.730 హెక్టార్ల ఆలయ భూములను లాక్కోవడానికి ట్రస్ట్‌ను రిజిస్టర్ చేసిన వ్యక్తి పేరిట ఎవరో నకిలీ పత్రాలు సృష్టించారు అని గుర్తించారు.

ఎస్‌డిఎం సదర్ ప్రఫుల్ల కుమార్ త్రిపాఠి ప్రకారం, గతంలో ఆలయం మరియు భూమిని కృష్ణ-రాముడి పేరిట నమోదు చేసినట్లు దర్యాప్తులో తేలింది. ఈ ఆలయాన్ని నిర్మించిన భూమిని గ్రామసభలో బంజరు భూమిగా పెర్కొంతున్నామని… ఇది ఎస్‌డిఎం కోర్టులో సవాలు చేయబడుతోందని, ప్రస్తుతం విచారణ జరుగుతుందని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version