నిన్న స్థిరంగా ఉన్న బంగారం ధరలు ఈ రోజు భారీగా దిగొచ్చాయి. హైదరాబాద్ మార్కెట్‌లో శనివారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.160 దిగొచ్చింది. దీంతో ధర రూ.39,190కు క్షీణించింది. అదేసమయంలో 10 గ్రాముల 22 కార్యెట్ల బంగార ధర కూడా రూ.180 పడిపోయింది. దీంతో ధర రూ.35,910కు తగ్గింది. ఇకపోతే బంగారం ధర తగ్గితే.. వెండి ధర మాత్రం పెరిగింది. కేజీ వెండి ధర రూ.50 పైకి కదిలింది. దీంతో వెండి ధర రూ.46,700కు చేరింది.
ఢిల్లీ మార్కెట్‌లో కూడా బంగారం ధర పరిస్థితి ఇలానే ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.200 తగ్గుదలతో రూ.37,850కు క్షీణించింది. అదేసమయంలో 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.200 తగ్గింది. దీంతో ధర రూ.36,650కు క్షీణించింది. పసిడి తగ్గితే వెండి ధర మాత్రం పెరిగింది. ధర కేజీకి రూ.50 పెరుగుదలతో రూ.46,700కు చేరింది.