వామ్మో.. భారీగా పైకెగ‌సిన బంగారం ధ‌ర‌.. వెండి కూడా..

-

నిన్న నిల‌క‌డ‌గా ఉన్న బంగారం ధ‌ర‌లు ఈ రోజు భారీగా పైకెగ‌సాయి. బుధవారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 370 రూపాయలు పెరిగింది. దీంతో 40,330 రూపాయల వద్దకు చేరుకుంది. ఇక పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 320 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 36,970 రూపాయలకు చేరింది. కాగా, వెండి ధర కూడా భారీ పెరుగుదల నమోదు చేసింది. వెండి కేజీకి ఒక్కసారిగా 300 రూపాయలు పెరిగింది. దీంతో హైదరాబాద్ లో కేజీ వెండి ధర 47,800 రూపాయల వద్ద నిలిచింది.

ఢిల్లీ మార్కెట్ లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇక్కడ పదిగ్రాముల 24 క్యారెట్ల బంగారం 300 రూపాయలు పెరిగింది. దీంతో 38,950 రూపాయల వద్దకు చేరింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 300 రూపాయల పెరుగుదల నమోదు చేసి 37,750 రూపాయలయింది. ఇక వెండి ధర ఇక్కడా కేజీకి 300 రూపాయలు పెరిగింది. దీంతో వెండి కేజీకి 47,800 రూపాయల వద్దకు చేరుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version