తెలంగాణలోని కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు శుభవార్త అందజేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. జాతీయ ఆరోగ్య మిషన్ కింద రాష్ట్రంలో పనిచేస్తున్న 51, 451 మంది కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సర్వీస్ ను 2026 మార్చి వరకు ప్రభుత్వం పొడిగించింది. ఈ సంవత్సరం మార్చితోనే వారి కాంట్రాక్ట్ గడువు ముగియనుండగా మూడు నెలల పాటు సర్వీస్ పొడిగించలేదు.

తాజాగా వారి సర్వీసును ప్రభుత్వం రెన్యువల్ చేయడంతో ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలాగే పిఎం అభిమ్ పథకం కింద 1,500 మంది, NHM కింద పలు పథకాల్లో పనిచేసే మరో 1,760 మందిని మరో సంవత్సరం కొనసాగించనుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.