గర్భిణీలకు మరో గుడ్ న్యూస్ చెప్పిన కేసీఆర్ సర్కార్..

-

గర్భిణీలకు పోషక ఆహారం ఎంతో అవసరం.. అయితే ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం గర్భిణీ స్త్రీల కోసం సంక్షేమ పథకాలను తీసుకువచ్చింది. అంగన్వాడీ కేంద్రాల ద్వారా, ఆశ వర్కర్ల ద్వారా ఇలా పలు రకాల సేవలను గర్భిణీ స్త్రీలకు అందుబాటులోకి తీసుకువచ్చింది తెలంగాణ ప్రభుత్వం. అయితే.. ప్రస్తుతం వేసవికాలం ప్రారంభమైంది. ఎండ తీవ్రత రోజు రోజుకు పెరిగిపోతోంది. అయితే ఇలాంటి సమయంలో గర్భిణీలు అంగన్వాడీ కేంద్రాలకు వచ్చి ఇబ్బందులు పడకుండా కేసీఆర్ సర్కార్ గర్భిణీలకు గుడ్ న్యూస్ చెప్పింది.

అంగన్వాడీ కేంద్రాల లబ్దిదారులకు వేసవి సెలవుల్లో ఇబ్బందులు రాకుండా ఇంటికే పోషకాహారం పంపించాలని
ప్రభుత్వం నిర్ణయించింది. మే 1-15 వరకు అంగన్వాడీ టీచర్లకు, మే 16-30 వరకు అంగన్వాడీ సహాయకులకు సెలవులు ఉన్నాయి. దీంతో అంగన్వాడీ చిన్నారులు, గర్భిణులు, బాలింతల ఇళ్లకే రేషన్ సక్రమంగా అందేలా చూడాలని అధికారులను ఆదేశించింది. లబ్ధిదారులకు గుడ్లు, బాలామృతం తదితర పోషకాహారం అందజేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version