రైల్వే ప్రయాణికులకు ఇండియన్ రైల్వేస్ రెండు శుభవార్తలని తీసుకొచ్చింది. తప్పక రైల్వే ప్రయాణికులు వీటిని తెలుసుకోవాలి. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. ఇండియన్ రైల్వేస్, ఐఆర్‌సీటీసీ ప్రయాణికుల కోసం తీపికబుర్లు తీసుకు రావడం జరిగింది. దీనితో రైల్వే ప్రయాణికులకు రిలీఫ్ కలగనుంది.
ఇది ఇలా ఉంటే రైళ్ల లో వండిన ఆహారాన్ని ప్రయాణికులకు అందుబాటు లోకి తీసుకు రావాలని నిర్ణయించింది ఇండియన్ రైల్వేస్. దీని కోసం ఇప్పటికే ఐఆర్‌సీటీసీకి లేఖ రాసింది రైల్వే బోర్డు. అయితే ఇప్పుడు మళ్ళీ ఫుడ్ సర్వీసులను ప్రారంభించాలని ఇండియన్ రైల్వేస్ కోరింది.
కరోనా మహమ్మారి వలన ఈ సర్వీసులని ఆపివేయడం జరిగింది. అయితే ఇప్పుడు వాటిని మళ్ళీ అందుబాటులోకి తీసుకు రానున్నారు. ఈ సర్వీసుల వలన ప్రయాణికులకు ఊరట కలగనుంది. అదే విధంగా రైల్వే ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్ ని కూడా అందించారు. ప్రత్యేక ట్రైన్‌లను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ఐఆర్‌సీటీసీ ప్రకటించింది.
న్యూ ఇయర్, క్రిస్మస్ సందర్భంగా సెంట్రల్ రైల్వేస్‌తో కలిసి స్పెషల్ ట్రైన్స్‌ను నడుపుతామని అంది. అయితే ఈ స్పెషల్ రైళ్ల యొక్క వివరాలని ఎన్‌టీఈఎస్ యాప్ ద్వారా ప్రయాణికులు పొందొచ్చు. దీనితో సమాచారం ప్రయాణికులకు అందుతుంది అని ఇండియన్ రైల్వేస్ అంది.