ప్రముఖ ప్రభుత్వ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. ప్రజలకు ఎన్నో బెనిఫిట్స్ ను అందిస్తూ వస్తుంది.ఇప్పటికే ఎన్నో సర్వీసులను అందిస్తుంది.. ఇప్పుడు మరో కొత్త సర్వీసును ప్రారంభించింది.మొదటిసారి వాట్సప్ బ్యాంకింగ్ సేవల్ని ప్రారంభించింది. ఎస్‌బీఐ ఖాతాదారులు చాలాకాలంగా ఈ సర్వీస్ కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఎస్‌బీఐ వాట్సప్ బ్యాంకింగ్ సేవల్ని త్వరలో ప్రారంభిస్తామని ఇటీవల ఎస్‌బీఐ ఛైర్మెన్ తెలిపారు..
ఈ బ్యాంకింగ్ సేవలను పొందాలని అనుకుంటే.. ముందుగా +919022690226 నెంబర్‌ను తమ స్మార్ట్‌ఫోన్‌లో సేవ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ నెంబర్‌కు Hi అని టైప్ చేసి మెసేజ్ చేయాలి. ఆ తర్వాత వచ్చే ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకొని బ్యాంకింగ్ సేవలు పొందొచ్చు. అయితే అంతకన్నా ముందు కస్టమర్లు వాట్సప్ బ్యాంకింగ్ సేవల కోసం రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా SMS WAREG అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి అకౌంట్ నెంబర్ టైప్ చేసి 917208933148 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాలి. కస్టమర్లు తమ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచే ఎస్ఎంఎస్ పంపాల్సి ఉంటుంది. ఎస్‌బీఐ వాట్సప్ బ్యాంకింగ్ సేవల కోసం రిజిస్టర్ చేసిన కస్టమర్లు +919022690226 నెంబర్‌కు Hi అని టైప్ చేస్తే ఒక మెసేజ్ వస్తుంది.
ప్రియమైన కస్టమర్, SBI Whatsapp బ్యాంకింగ్ సేవలకు స్వాగతం! దయచేసి దిగువన ఉన్న ఏవైనా ఎంపికల నుండి ఎంచుకోండి…
1. ఖాతా బ్యాలెన్స్
2. మినీ స్టేట్‌మెంట్
3. WhatsApp బ్యాంకింగ్ నుండి డి-రిజిస్టర్ చేసుకోండి ప్రారంభించడానికి మీరు మీ ప్రశ్నను కూడా టైప్ చేయవచ్చు..
పైన తెలిపిన వాటిలో మీకు కావలసిన ఆప్షన్ ను ఎంచుకోవాలి…వాట్సప్ ఉపయోగిస్తున్న ఎస్‌బీఐ కస్టమర్లందరూ ఈ సేవలు ఉపయోగించుకోవచ్చు. అయితే ఎస్‌బీఐ అకౌంట్‌తో రిజిస్టర్ అయి ఉన్న మొబైల్ నెంబర్‌తో మాత్రమే వాట్సప్ బ్యాంకింగ్ సేవలు లభిస్తాయి. ఇప్పటికే ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ హోల్డర్లకు వాట్సప్ ద్వారా సేవలు లభిస్తున్నాయి. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ హోల్డర్స్ అకౌంట్ వివరాలు, రివార్డ్ పాయింట్స్, ఔట్‌స్టాండింగ్ బ్యాలెన్స్, కార్డ్ పేమెంట్స్ లాంటి సేవల్ని వాట్సప్ ద్వారా పొందుతున్నారు..ఇక్కడ గుర్తుంచుకొవాల్సిన విషయం బ్యాంక్ కు లింక్ చేసిన నెంబర్ కు మాత్రమే వాట్సప్ బ్యాంకింగ్ సేవలను పొందుతారు.