యూట్యూబ్‌లో షార్ట్స్‌ చేసేవాళ్లకు గుడ్‌ న్యూస్‌.. ఇక ఇన్‌కమ్‌ డబల్‌..

-

ఇన్‌స్టాలానే..యూట్యూబ్‌లో షార్ట్స్‌ చేసేవాళ్లు చాలామంది ఉన్నారు..యూట్యూబ్‌లో షార్ట్ ఫిలిమ్స్‌ను డైరెక్ట్ చేసి.. సినిమా అవకాశం పొంది దేశంలో అత్యంత భారీ బడ్జెట్ సినిమా తెరకెక్కించే స్థాయికి ఎదిగిన వాళ్లు ఉన్నారు…స్టూడెంట్స్, గృహిణులు, ఉపాధ్యాయులు తమకు తెలిసిన విద్యను, వంటలను యూట్యూబ్‌లో వీడియోలుగా అప్‌లోడ్ చేసి వేలల్లో సంపాదిస్తున్నారు. ట్రావెలింగ్ లాగ్స్ చేసి లక్షలు సంపాదించేవారు కూడా చాలా మంది ఉన్నారు. యూట్యూబ్‌లో షార్ట్‌ వీడియోస్‌ చేసి డబ్బులు సంపాదించుకునే వారికి ఇప్పుడు చెప్పేవార్త శుభవార్త అనే చెప్పాలి.. ‘యూట్యూబ్ పార్ట్‌నర్ ప్రొగ్రామ్’(వైపీపీ) కొన్ని నిబంధనలను జోడించి కొత్తగా ‘షార్ట్స్ మానిటైజేషన్ మాడ్యూల్‌’ను తీసుకువచ్చింది. ఈ షార్ట్స్ మానిటైజేషన్ మాడ్యూల్ ప్రకారం.. షార్ట్ వీడియోల మధ్యలో వచ్చే అడ్వర్టైజ్‌మెంట్స్ ద్వారా వచ్చే రెవెన్యూను, కంపెనీ క్రియేటర్‌కు షేర్ చేయనుంది..

కొత్త నిబంధనలను అంగీకరిస్తే 2023 ఫిబ్రవరి 1 నుంచే యూట్యూబ్ క్రియేటర్లు షార్ట్స్‌తో సంపాదించుకోవడం మొదలుపెట్టవచ్చు. ఈ నిబందనల ద్వారా గతంలో కంటే ఇప్పుడు యూట్యూబ్ క్రియేటర్లకు ఇన్‌కమ్ జనరేట్ చేసుకునే అవకాశం మరింత పెరిగింది. అయితే క్రియేటర్లు కొత్తగా తీసుకువచ్చిన నిబంధనలను, మాడ్యూల్స్‌ను అంగీకరించి ఫాలో అవ్వాలి..

ఏంటా మాడ్యూల్స్‌..?

యూట్యూబ్ కొత్తగా మూడు మాడ్యూల్స్‌ను తీసుకువచ్చింది. అవి.
వాచ్ పేజ్ మానిటైజేషన్ మాడ్యూల్
షార్ట్స్ మానిటైజేషన్ మాడ్యూల్
కామర్స్ ప్రాడక్ట్ అడ్డెండమ్ మాడ్యూల్

వాచ్ పేజ్ మానిటైజేషన్ మాడ్యూల్ నిబంధనలకు యూట్యూబ్ క్రియేటర్లు అంగీకారం తెలిపితే.. వారి చానెల్‌లో వాచ్ చేసిన వీడియోలు, లైవ్ స్ట్రీమింగ్ వాటి వాచ్ హవర్స్‌ను బట్టి చెల్లింపులు ఉంటాయి.

‘షార్ట్స్ మానిటైజేషన్ మాడ్యూల్’ నిబంధనలను బట్టి షార్ట్ వీడియోల మధ్యలో వచ్చే యాడ్‌ వాచ్ టైమ్‌ను బట్టి ఇన్‌కమ్ జనరేట్ అవుతుంది.

‘కామర్స్ ప్రాడక్ట్ అడ్డెండమ్’ ద్వారా క్రియేటర్లకు ఫ్యాన్స్‌ నుంచి డొనేషన్లు, ఫండింగ్‌ ఆప్షన్లతో ఫీచర్స్ తమ ఛానెల్‌కు యాడ్ అవుతాయి.

అంగీకరించకపోతే ఆపేస్తారు..

ఇప్పుడున్న అందరు యూట్యూబర్లు ఈ కొత్త ‘యూట్యూబ్ పార్ట్‌నర్ ప్రోగ్రామ్’(వైపీపీ) నిబంధనలకు అంగీకారం తెలపాల్సి ఉంటుంది. ప్రపంచంలో ఉన్న అందరు క్రియేటర్లకు ఈ కొత్త వైపీపీ నిబంధనలకు అంగీకారం తెలిపే చివరి రోజు 2023 జులై 10. ఈ తేదీ తరువాత నిబంధనలను యాక్సెప్ట్ చేయని యూట్యూబ్ క్రియేటర్ల ఛానెళ్లను తొలగించడమే కాకుండా వారి మానిటైజేషన్ అగ్రిమెంట్‌ను సైతం క్యాన్సిల్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి గడువులోపు వైపీసీ నిబంధనలు అంగీకరించేయండి..డబ్బులు సంపాదించండి.!!

Read more RELATED
Recommended to you

Exit mobile version