కరోనా వైరస్ కష్ట కాలంలో రుణ గ్రహీతలకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. దేశీ కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ పలు ప్రైవేట్ బ్యాంకుల చీఫ్‌ల తో కలిసి మాట్లాడడం జరిగింది.
దీనిలో రుణ మంజూరును పెంచాలని కోరారు. వ్యక్తిగత రుణాలతో పాటు బిజినెస్ రుణాలు కూడా అందించాలని ఆయన తెలియ జేయడం జరిగింది. ఈ మహమ్మారి నేపథ్యం లో ఆర్ధిక ఇబ్బందులు లేకుండా వుండేటట్టు చూసుకోమని తెలిపారు.
ఇది ఇలా ఉంటే దేశీయ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పడానికి సిద్ధం అవుతోంది. ఎస్బీఐ యెనో యాప్ నుండి త్వరితగతిన రుణాలు అందించేందుకు చూస్తోంది. యెనో ద్వారా టూవీలర్, క్విక్ లోన్స్ ని ఇవ్వనుంది. వీటి వలన కస్టమర్స్ కి సూపర్ బెనిఫిట్స్ కలగనున్నాయి.
మరో ముఖ్యమైన విషయం ఒకటి వుంది. అదేమిటంటే కెనరా బ్యాంక్ తో సిండికేట్ బ్యాంక్ విలీనం అవ్వడం తో SYNBతో ప్రారంభమయ్యే ఐఎఫ్ఎస్‌సీ కోడ్లు అన్ని మారిపోయాయి. కాబట్టి కస్టమర్స్ గమనించాలి. జూలై 1 నుంచి ఎస్‌వైఎన్‌బీతో ప్రారంభమయ్యే ఐఎఫ్ఎస్‌సీ కోడ్లు పని చెయ్యవు.