నిరుద్యోగులకు శుభవార్త : ఏపీ ప్రభుత్వ ఉద్యోగాల నియామక క్యాలెండర్ ఆరోజునే ?

ఏపీ ప్రభుత్వ ఉద్యోగాల నియామక క్యాలెండర్ విడుదల వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే మే 30వ తేదీన ప్రభుత్వ ఉద్యోగాల నియామక క్యాలెండర్ విడుదల కానున్నన్నట్టు సమాచారం. ఉగాది రోజున ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేయాలని గత నెలలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. అయితే ఆర్థిక శాఖ అనుమతి రాక పోవడంతో నియామక ప్రక్రియలో జాప్యం జరిగింది.

jagan
jagan

ఇక సీఎం పదవి చేపట్టిన రెండో వార్షికోత్సవం రోజు అంటే మే 30 తేదీన నియామక క్యాలెండర్ ప్రకటించాలని తాజాగా ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకున్నారు. వివిధ శాఖల్లో ఉన్న ఖాళీల వివరాలు కోసం ఇప్పటికే  సీఎస్ నేతృత్వంలో ప్రభుత్వం కసరత్తు చేసింది. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న దాదాపు 20వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు సిద్ధమవుతోంది. ఏపీలో నిరుద్యోగులు ఎప్పటినుంచో ఆశగా ఎదురుచూస్తున్న ఉద్యోగాల భర్తీ ఈ క్యాలెండర్ ప్రకటించిన అనంతరం మొదలు కానుంది.