BIG BREAKING: చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేసిన హై కోర్ట్!

-

ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు స్కిల్ స్కాం కేసు లో రిమాండ్ లో ఉండగానే.. మరో కొన్ని కేసులలో ముద్దాయిగా ఉండగా కోర్ట్ లో ఇవి విచారణలో ఉన్నాయి. ఈ కేసులలో ఒకటి అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసు… కొద్దీ రోజులుగా ఈ కేసులలో చంద్రబాబును అరెస్ట్ చేయకుండా ఉండడానికి ముందస్తు బెయిల్ కోసం తమ లాయర్లు ఎంతగానో శ్రమిస్తున్నారు, కానీ ఫలితం దక్కలేదు. అయితే ఈ రోజు హై కోర్ట్ లో విచారణలు విన్న న్యాయమూర్తి చంద్రబాబుకు తాత్కాలికంగా ఈ కేసులో ఊరట కలిగేలా తీర్పును ఇచ్చింది. చంద్రబాబు తరపున లాయర్లు పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ ను విచారించిన కోర్ట్ తాత్కాలికంగా బెయిల్ ను ఇస్తున్నట్లు తీర్పును ఇచ్చింది. అయితే ఈ కేసుకు సంబంధించిన హై కోర్ట్ మళ్ళీ సిఐడి వారికి ఆదేశాలను ఇచ్చే వరకు చంద్రబాబును అరెస్ట్ చేయడానికి వీలు లేదని తెలిపింది.

దీనితో ఒక కేసులో చంద్రబాబు కు ఉపశమనం లభించింది. అయితే హై కోర్ట్ ఈ తాత్కలిక బెయిల్ ను ఎన్నో రోజుల వరకు పరిగణలోకి తీసుకుంటుంది అన్నది తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version