ఏపీలో వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారం మరో మలుపు తిరిగింది..ఆయన న్యూడ్ వీడియో కాల్ వ్యవహారం కాస్త…కులాల మధ్య కుంపటి రాజేసే పరిస్తితి వచ్చింది. మాధవ్ కు ఇప్పటివరకు సొంత పార్టీ నుంచి సపోర్ట్ రాలేదు…కానీ ఆయన సొంత సామాజికవర్గం కురుబ వర్గం నుంచి మద్ధతు దక్కింది. వీడియో నిజమని తేలకుండా ఆయనని టార్గెట్ చేసి విమర్శించడంపై కురుబ వర్గం ఫైర్ అవుతుంది. పైగా ఇదంతా టీడీపీలోని కమ్మ వర్గం చేయిస్తుందని కురుబ వర్గం మండిపడుతుంది. అసలు చేసిన తప్పుని సమర్ధించడమే కాకుండా…తమ వర్గంపై విమర్శలు చేయడం ఏంటని…కమ్మ వర్గం ఆందోళన కార్యక్రమాలు చేస్తుంది. ఇలా మాధవ్ న్యూడ్ వీడియో కాల్ వ్యవహారం కాస్త కులాల మధ్య రచ్చకు దారితీసింది.
అయితే మాధవ్ న్యూడ్ వీడియో కాల్…నిజమా? కాదా? అని పోలీసులు తేల్చే పనిలో ఉన్నారని తెలుస్తోంది. ఇదే విషయాన్ని మాధవ్ కూడా చెప్పారు. తనపై టీడీపీ నేతలు కుట్ర చేశారని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పారు. ఇక ఈ అంశంపై టీడీపీతో సహ ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి…ఎంపీని సస్పెండ్ చేయాలని, పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇక ఈ వ్యవహారంపై వైసీపీ అధిష్టానం సైలెంట్ గా ఉంది..పైగా మాధవ్ కు సొంత పార్టీ నుంచి మద్ధతు దక్కలేదు. దీంతో ఆయనపై వేటు పడవచ్చని ముందు ప్రచారం జరిగింది. కానీ ఏమైందో ఏమో గాని…సడన్ గా మాధవ్ వ్యవహారంపై జగన్ సైలెంట్ అయినట్లు తెలిసింది. దీనికి కారణం కులాల సమీకరణే అని తెలుస్తోంది.
రాయలసీమలో అతి పెద్ద సామాజికవర్గంగా ఉన్న కురుబలు ఇప్పుడు మాధవ్ కు మద్ధతుగా నిలిచారు. ఇలాంటి సమయంలో మాధవ్ పై వేటు వేస్తే కురుబ వర్గం వైసీపీకి దూరమయ్యే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది..అందుకే మాధవ్ వ్యవహారంలో జగన్ ఆచి తూచి అడుగులేస్తున్నారని సమాచారం. మొత్తానికైతే మాధవ్ మ్యాటర్ కాస్త…కులాల మధ్య గొడవకు దారితీసింది.