వాళ్ళు కాకుండా ఒక్క కామన్ మ్యాన్ ని తప్పని చెప్పమనండి !

గీతం ఆక్రమణలో ఉన్న 40 ఎకరాల ప్రభుత్వ భూమి ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే అది కక్ష సాధింపు చర్యలని బాబు, లోకేష్, టీడీపీ నేతలు మాట్లాడడం దారుణమని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాధ్ అన్నారు. ప్రభుత్వ భూమిని కాపాడాలని పాలసీగా మేము తీసుకున్నామన్న ఆయన కోర్టు ఆర్డర్ ని కూడా వక్రీకరించి ప్రభుత్వం చర్య దుర్మార్గం అన్నట్లు కొంత మంది ప్రచారం చేస్తున్నారని అన్నారు. అసలు కోర్టుకు వేసిన పిటిషన్ లోనే ఆ భూమి మీద హక్కు ఉన్నట్లు ఎక్కడా వారు పేర్కొనలేదని ఆయన ఆన్నారు.

అప్పనంగా ప్రభుత్వ భూమిని కొట్టేయాలని చుస్తున్నారన్న అయన ఆ పిటిషన్ పై..కోర్ట్ ఏమి వ్యాఖ్యానించిందో చెప్పాలని డిమాండ్ చేశారు. గీతం అక్రమణలో ఉన్న భూమిని ప్రభుత్వ అవసరాల కోసం వాడతామని ఎమ్మెల్యే అనరు. మా వారి మీద కూడా భూఅక్రమణలు ఉన్నాయని టిడిపి నేతలు అంటున్నారని వాటిని వెంటనే బయట పెట్టాలని అన్నారు. గీతమ్ ఆక్రమణలో వున్న వందల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవడం గురించి చంద్ర బాబు, లోకేష్, 70 రోజులు జైల్లో ఉండి వచ్చిన అచ్చన్నాకాకుండా ఒక్క కామన్ మ్యాన్ తప్పు అని చెప్పినా వెనక్కు తగ్గడానికి సిద్ధమని ఆయన అన్నారు.